అంతటా
ప్రచార సాధనాలే
కొన్నింటా
తీరని ఆశయాలే
రంగులతో
జెండాల వందనాలే
హంగులతో
ఆర్భాటపు పొంగులే
కలుపుదనంతో
ఆలింగన ప్రేమలే
మెలకువతో
ఒట్టి ముచ్చట్లే
ఎన్నికలంటే
పరుగు పందాలే
చేయి చేయి
కలిపే ఇంద్రజాలాలే
వీధి వీధిలో
రంగుల రాట్నాలే
ప్రతి గడపలో
వాగ్ధానపు విసుర్లే
చురకలతో
చమక్కుల తూటాలే
చేతి వాటంతో
అంతటా సిరులే
ఓదార్పుతో
భుజం తట్టడాలే
నేర్పుతో
ఓట్లు పట్టుకోడాలే
ఎన్నికలు
కలల మెరుపులే
నిజానికి
భ్రమల బతుకులే
ఊరి ఊరిలో
ఉర్రూతల ఉత్సాహాలే
ఊహకందని
ఉత్తుత్తి పొంగులే
ఎన్నికల కాలం
అన్నీ విడ్డూరాలే
ముద్ర కోసం
ఒప్పిదాల తంటాలే
– నరెద్దుల రాజారెడ్డి
9666016636