ఎన్నికలంటే రాజకీయ వ్యాపారం కాదు.. సామాజిక బాధ్యత

– ప్రముఖ సామాజికవేత్త,హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కురుమ
నవతెలంగాణ-ఓయూ
ఎన్నికలంటే రాజకీయ వ్యాపారం కాదని..సామాజిక బాధ్యత అనిప్రముఖ సామాజికవేత్త, లాయర్స్‌ ఫోరంపర్‌ సోషల్‌ జస్టిస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయ వాది నర్రి స్వామి కురుమ అన్నారు. ఓయూలో యూత్‌ అసెంబ్లీ కార్యక్రమానికి నిర్వాహకులు విజరు మారుతి రావు కురుమ శ్రీశైలం ల ఆహ్వానం మేరకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో యువతకు అన్ని ప్రధాన పార్టీలు టికెట్లను కేటాయించాలని కోరారు. అదేవిధంగా యువత అంటే సామాజిక బాధ్యత ఉండి సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తులై ఉండాలి తప్ప వార సులుగా వచ్చే వాళ్ళు మాత్రం కాదన్నారు. సమాజంలో ఎన్నికలంటే రాజకీయ వ్యాపారంగా మారాయని.. ఎంత ఖర్చు పెట్టాము ఎంత సంపాదించుకున్నామన్న దానిమీద లెక్కలు ఉన్నాయి తప్ప సామాజిక బాధ్యత కరువైందన్నారు. నేటి యువత ఎన్నికలంటే సామాజిక బాధ్యతగా గుర్తించి పోటీలో పాల్గొని నచ్చిన నాయకునికి, ప్రజాసేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవలసినటువంటి బాధ్యత ఉందని తెలియ జేశారు. ప్రధానంగా స్థానిక కంపెనీలలో స్థానికులకు 50 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. దేశంలోనే అత్యధిక ధనవంతమైన కంపెనీలుగా చెప్పుకునే దివిస్‌ ఎటిరో పారామెడికల్స్‌ మొదలగు కంపెనీలు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతున్నా యన్నారు. అందుకోసం యువత చైతన్యమై ఉద్యమించ వలసినటువంటి అవసరం ఉందన్నారు. యువత కోసం స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేసి శారీరక అటుత్వాన్ని పెంపొం దించడం కోసం వివిధ సామాజిక సంఘాలు పనిచేయా లన్నారు. ఈ యూత్‌ అసెంబ్లీ కార్యక్రమాలను ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ మండలంలో ప్రతీ గ్రామంలో ప్రతీ పల్లెలో ఏర్పాటు చేసి కింది స్థాయి నుంచి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి యూత్‌కు ఒక యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వాలు ప్రధాన పార్టీలు సామాజిక సంఘాలుగా పనిచేస్తున్నటు వంటి సంస్థల అందరిని ఒక వేదికపై తీసుకొచ్చి వారికి తోడ్పాటున అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్ర మ నిర్వాహకులు మారుతి రావు, కే శ్రీశైలం, పీసీసీ ప్రధాన కార్యదర్శి గుర్రం భాస్కర్‌, జనసేన, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ, లోక్‌సత్తా నాయకులు, కళాకారులు, కవులు, ఓయూ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ వివిధ సామాజిక సంఘాలకు సంబంధించిన, వివిధ పార్టీలకు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.