– రెండేండ్ల నిరీక్షణ తెర
– ఏర్పాట్లు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం కేజీబీవీ, జిల్లా పరిషత్, మండల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను, సభ్యులను రెండేండ్ల కాల పరిమితికి ఎన్నుకుంటారు. వారు రెండేళ్లకు మించకుండా పదవిలో కొనసాగుతారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి పాఠశాల విద్యా కమిటీ సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో పాఠశాల అభివద్ధికి తీర్మానాలను చేస్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019 నవంబర్ 30న ఎస్‌ఎంసీ కమిటీలను ఎన్నుకున్నారు. వీరి కాల పరిమితి రెండేళ్లు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వం పదవి కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది.
కమిటీలో సభ్యులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగన్‌వాడీ టీచర్ ఏఎన్‌ఎం మహిళా సమైక్య అధ్యక్షురాలు కమిటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు.
కో ఆప్షన్ సభ్యులు
పూర్వ విద్యార్థుల నుంచి లేదా విద్యావేత్తలు లేదా దాతలు లేదా స్వచ్ఛంద సంస్థల సభ్యులను తీసుకోవచ్చు. శాశ్వత ఆహ్వానితుడిగా సర్పంచి వ్యవహరిస్తాడు.
ఇవి మార్గదర్శకాలు
ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి వరకు తరగతికి ముగ్గురు చొప్పున 15 మందిని ఎన్నుకోవాలి వీరిలో 10 మంది మహిళలు కచ్చితంగా ఉండాలి. ప్రాథమికున్నత పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 21 మందిని వీరిలో 14 మంది మహిళలు ఉండాలి. 8వ తరగతి వరకు ఉంటే 24 మందిని ఎన్నుకోవాలి. వీరిలో 16 మంది మహిళలను ఎన్నుకోవాలి. ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 9 మందిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో 6 మంది మహిళలను తీసుకోవాలి ఆయా పాఠశాలలో సభ్యులందరూ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ లను ఓటింగ్ ద్వారా గాని చేతులు ఎత్తడం ద్వారా గాని ఎన్నుకుంటారు.
సభ్యుల బాధ్యత
పాఠశాల కమిటీలో ఎన్నికైన వారు కచ్చితంగా కమిటీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. పిల్లల చదువులా పురోగతిని పరిశీలిస్తూ విద్యాభివద్ధికి పాటుపడాలి. పిల్లల ఉపాధ్యాయులు హాజరును పరిశీలిస్తూ ఉండాలి. బడి బయట పిల్లలు బడిలో చేర్పించాలి. పాఠశాల విద్యాభివద్ధికి కషి చేయాలి.
నోటిఫికేషన్
అంగన్‌వాడీ పాఠశాలలో ఎస్‌ఎంసి సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే చదివి విద్యార్థులు తల్లిదండ్రుల పేర్లను నోటీసు బోర్డుపై ఉంచుతారు. 22న ఏమైనా అభ్యంతరాలుంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధానోపాధ్యాయుడు స్వీకరిస్తారు 24న అభ్యంతరాలు పరిశీలన అనంతరం తుది బాజాబితాలు నోటీసు బోర్డుపైన ఉదయం 11 గంటలకు ఉంచుతారు. 29న మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌ఎంసి సభ్యులతో పాటు చైర్మన్ వైస్ చైర్మన్ అని ఎన్నుకుంటారు. 29న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:00 వరకు మొదటి సమావేశం నిర్వహిస్తారు.