ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

– కలెక్టర్‌ ఆర్‌.వి కర్ణన్‌
నవతెలంగాణ-చండూరు
అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌.వి కర్ణన్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన చండూరు లో పర్యటించారు. ముందుగా తహసిల్దార్‌ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. స్థానిక డాన్‌ బోస్కో జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌, స్ట్రాంగ్‌ రూముల ఏర్పాటును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్డీవో కార్యాలయాన్ని , చౌరస్తాలో ని ప్రభుత్వ అతిథి గహాన్ని సందర్శించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి ని అంతా పాటించాలన్నారు. పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేయాలన్నారు. ఆయన వెంట రిటర్నింగ్‌ అధికారి దామోదర్‌ రావు , తహసిల్దార్‌ రవీందర్‌ రెడ్డి, ఎస్సై సురేష్‌ , ఎలక్షన్‌ డీటి దీపక్‌, పి.ఆర్‌ ఏ ఈ రమేష్‌, సిబ్బంది ఉన్నారు.