బీసీలకు 42శాతం రిజర్వేషన్ల్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

Elections should be held only after implementation of 42 percent reservation for BCs– ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పోశెట్టి
నవతెలంగాణ – కుభీర్
ఈనెల 10వ తేదీన హైదరాబాద్ లోని ఇంద్ర  పార్కు నిర్వహించే బిసిల సత్యాగ్రహ దీక్షకు జిల్లాలోని బీసీ ప్రజలు లందరు కలసి అధిక సంఖ్యలో హాజరు కావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పోశెట్టి అన్నారు. సోమవారం కుభీర్ మండల కేంద్రంలో బీసీ మండల అధ్యక్షుడు పుప్ఫల పీరాజి అధ్యక్షతన బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశనికి ముఖ్య అతితిగా హాజరైన తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పోశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాటకు కట్టుబడి రానున్న  స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని సేకరించాలని అన్నారు. లేని యెడల బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమం లో బీసీ నాయకులు బోడిగం సాయినాథ్,శ్రీకారం దత్తత్రి ,గజ్జరాం,నారాయణ తదితరులు పాల్గొన్నారు.