సమన్వయం, సమిష్టి కృషితో ఎన్నికలు విజయవంతం: పోలీసులు

నవతెలంగాణ – మహదేవపూర్
పార్లమెంట్ ఎన్నికల  ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం పట్ల మండల అధికారులు పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుండి  మే 13వ తేదీ వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో మండల సహాయ, సహకారాలు భాగస్వామ్యం మరువలేనిదని మండల అధికార పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో  సహకరించిన ప్రతి ఒక్కరిని వారు అభినందించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన మన మన మండలంలోని తీవ్రవాద ప్రభావిత మడలాలైన ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు. పోలింగ్ సమయం  ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకే అయినప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తున ఎండలను సైతం లెక్కచేయక ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని,  అందువల్ల గత పార్లమెంటు ఎన్నికల కంటే 3 శాతం అధికంగా పోలింగ్ నమోదు జరిగిందని తెలిపారు.  ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులను, అనధికారులను, మండల ప్రజలను, పాత్రికేయులను  మండల అధికారి పోలీసులు అభినందించారు.