ఎన్నికల బాండ్లు… బహిరంగ అవినీతి

Electoral bonds... open corruptionరాజకీయ పార్టీలకు నిధులు లభించే విధా నం ‘ఎన్నికలబాండ్ల’ ప్రక్రియను భారతదేశ అత్యు న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ సందర్భంలోని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత గలవి. ”దాతల వివరాలను గోప్యతలో ‘క్విడ్‌ప్రోకో’ అనగా ‘నేను ఇంత మొత్తం ఇస్తే నాకేమిలాభం’ అనే కుతంత్రం దాగి ఉన్నది” అని వ్యాఖ్యానించింది. లబ్ధి పొందడానికి బీజేపీ చేసిన ప్రయోగంపై ఈ తీర్పు చెంపదెబ్బ. గత ఐదేండ్లుగా ప్రఖ్యాత న్యాయవా దులు ప్రశాంత్‌భూషన్‌, పిల్సిబల్వంటి వారితోపాటు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించిన దరిమిలా కోర్టు ఈవిధమైన తీర్పును ఇవ్వడానికి వీలు కలిగింది. ఈ తీర్పుతో ఎన్నికల బాండ్ల ద్వారా ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో లాభ పడిన బీజేపీ నోట్లోవెలక్కాయ పడినట్లు అయింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అది జీర్ణించుకోలేకపోతున్నది. బహిరంగం గానే తమ అక్కసు వెళ్ళగకుతున్నారు. దేవుడి మాట ఎత్తనిదే పొద్దుగడవని పరిస్థితికి దిగజారుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సమా వేశంలో ప్రసంగిస్తూ, ”నేడున్న సమాజంలో శ్రీకృష్ణునికి సుధాముడు (కుచేలుడు) కొన్ని పలహారాలిస్తే అది కూడా అవినీతిలో భాగమని, శ్రీకృష్ణుడు కూడా అవినీతి పరుడే అని తీర్పునిస్తున్నాయి” అంటూ ఎన్నికల బాండ్ల సందర్భంగా సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయంపై పరో క్షంగా తమ మనోగతాన్ని బయట పెట్టుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఎన్నికల బాండ్లరూపంలో కార్పొ రేట్‌ కంపెనీలు రాజకీయ పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి ముట్టచెబుతున్న విరాళాలు కేవలం ఫలహారాలు మాత్రమే అనబడేవారి ఉద్దేశం! దేశ అత్యున్నత న్యాయస్థానపు తీర్పును ఇలా అగౌరవపరుస్తూ ప్రధానమంత్రిస్థాయిలో ఉండికూడా ప్రసంగించడం ఏమాత్రం అంగీకారం కాదు. సుప్రీంకోర్టు తీర్పులను సెలెక్టివ్‌గా ఆహ్వానించడం ఎవరికీ మంచిదికాదు. ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యులను ప్రభావితం చేసి కోర్టు తీర్పులను ధిక్కరించేలా ఉసిగొలుపుతాయి. ఈమాత్రం కూడా గమనించకపోవడం కడుశోచనీయం.
ఇన్‌కంటాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌వారు నిర్వహించే దాడులకు ప్రధాన రాజకీయ పార్టీకి అందుతున్న నిధులకు సంబంధం ఉన్నట్టు వెలువడింది. గత ఐదేళ్లకాలంలో దాదాపు 30 కంపెనీలు వారిపై ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు జరిపిన దాడుల తర్వాత రూ.335 కోట్ల నిధులు ఎన్నికల బాండ్ల రూపంలో చెల్లించుకున్నారు. వీరిలో 23 కంపెనీలు 2014 నుండి ఐటిదాడులు జరి గేనాటికి ఒక్క పైసా కూడా ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. కేవలం 2022- 23 సంవత్సరానికిగాను ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం రూ.850 కోట్లు ఇందులో బీజేపీకి చేరింది. రూ. 720 కోట్లు అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో బీజేపికి చేరిన మొత్తాలు 57, 61 శాతంగా నమోదైనవి. ఇప్పటి వర కు ఎన్నికల బాండ్ల ద్వారా నమోదు కాబడిన నిధులు రూ.16,518 కోట్లు. ఇందులో ఒకకోటి లేదా అంతకుమిం చిన మొత్తాలలో కొనుగోలు చేయబడినవి 94.41శాతం. కోట్లరూపాయల విరాళం ఇచ్చేవారు ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా ఇస్తారని ఎంత నమ్మబలికినా అది వాస్తవమ గునా? ఇలాంటి బాండ్లను కొనుగోలుచేసిన వారు తమ అస్తిత్వాన్ని సదరు రాజకీయ పార్టీకి తెలియజేయకుండా చెల్లిస్తారని కూడా నమ్మడం సబబేనా?
కంపెనీలు రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే విధానం స్వతం త్రం వచ్చినప్పటి నుండి కూడా ఉన్నది. అయితే స్వతంత్రం వచ్చిన పదేండ్లలోని ప్రయివేటు సంస్థలు ఎన్నికల విరాళాల ద్వారా లాలుచి పడుతున్నాయని గమ నించిన నాటిపెద్దలు 1960లో ఈ విరా ళాలపై సీలింగును విధించారు. అదే సందర్భంలో కార్పొరేట్‌ కంపెనీలు పుట్టు కొచ్చి మరింతగా రాజకీయాలను ప్రభా వితం చేస్తున్నాయని భావించి 1969లో కార్పొరేట్‌ ఫండింగ్‌ మొత్తాన్ని బ్యాన్‌ చేశారు. అయితే నూతన ఆర్థిక విధా నాల శకం ప్రారంభమైన తొలినాళ్లలోనే దేశప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ గాంధీ ఆధ్వర్యంలో 1985లో ఈ కార్పొరేట్‌ ఫండింగ్‌పై విధించిన నిర్బంధాన్ని తొలగించారు. అయితే నిరంతరం లాభార్జనకు పన్ను ఎగవేతకు వివిధ దారులను వెతుక్కునే చాకచక్యంతో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ ద్వారా 1993లో ప్రతిపాదించి, రాజకీయపార్టీలకు అందించే విరా ళాలన్నింటిపై పన్ను రాయితీని సాధించుకుంది. ఇలా విరాళాలు చెల్లించడం పన్నురాయితీ పొందడం విచ్చల విడిగా సాగింది.
1996లో రాజకీయ పార్టీలన్నీ ఆదాయ రిటర్న్స్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలాంటి రిటర్న్స్‌ దాఖలు చేస్తున్న సందర్భంలో దాతల వివరాలు బయటపడి కొన్ని కంపెనీలకు తాము నిధులు సమకూర్చిన రాజకీయ పార్టీ అధికారంలోకి రానప్పుడు ఇబ్బందిఏర్పడింది. ఈ సం దర్భంలో తట్టిన ఆలోచననే ‘ఎన్నికల ట్రస్టు’ అనే విధానం. ఎవరైనా ఒకరు (సాధారణంగా కార్పొరేట్‌ సంస్థ) ఏర్పాటు చేసే ఈ ఎలక్టోరల్‌ ట్రస్టుకి ఏకంపెనీ యైనా విరాళాన్ని అందించవచ్చు. సదరు విరాళాలను ఆ ట్రస్టు వివిధ రాజకీయ పార్టీలకు అవి పొందిన ఓట్ల నిష్పత్తిని బట్టి నిధు లను మళ్లిస్తుంది. సదరు ట్రస్టు తాముసేకరించిన విరాళాల వివరాలను భారతఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తుంది. అయితే ఇందులో ఉన్నకాస్తయినా జెన్యూనిటీ ఏమంటే దాతల వివరాలు నేరుగా రాజకీయ పార్టీకి చేరవు. అందరి ద్వారా సేకరించబడిన మొత్తంలో నుంచే ఒక రాజకీయ పార్టీకి నిష్పత్తి ప్రకారం వెళుతుంది కాబట్టిి ప్రత్యేకంగా ఒక కంపెనీకి లాభం చేకూర్చాలనే ప్రతిఫల బాధ్యత రాజకీయ పార్టీలకు ఉండదు. ‘ప్రోగ్రెసివ్‌ ఎలక్ట్రోరల్‌ ట్రస్ట్‌’ అనే సంస్థ ను మొట్టమొదటిగా టాటాగ్రూప్‌ 1996లో ఏర్పాటు చేసింది. అప్పటినుండి అది నిధులను సమకూరుస్తూ రాజకీయ పార్టీలకు సమర్పిస్తూ తమకు కావలసిన పనిని తాము తీసుకొని తమకు నిధులను అందించిన వారికి కూడా పనులు చక్కబెడుతూ వస్తున్నది! ఇంతలా ఉపయోగ పడు తున్నవారికి ఏదైనా మేలుచేయాలని వాజ్‌పేయి ఆధ్వర్యం లోని ఎన్డీఏ ప్రభుత్వం 2003లో ఇలాంటి డొనేషన్స్‌ అన్నిం టికీ 100 శాతం పన్నురాయితీ కల్పించింది. సాంప్రదాయ పద్ధతిలో టాటా గ్రూపు సంస్థ ఏర్పాటు చేసిన ఎన్నికల ట్రస్టు వ్యవహరిస్తుందని కాబోలు, భారతిగ్రూప్స్‌ సంస్థ ‘ప్రుడెంట్‌ ఎలక్ట్రోరల్‌ ట్రస్ట్‌’ అనే మరో సంస్థను 2013లో ఏర్పాటు చేసింది. కానీ భారతీ గ్రూప్‌ స్థాపించిన ఎలక్టోరల్‌ ట్రస్టు ఇంకా కొనసాగుతున్నది! ఈ ట్రస్టు ద్వారా వస్తున్న మొత్తంలో బీజేపీకి రు.100 వస్తే కాంగ్రెస్‌కు 19 పైసలు అందుతున్నాయి.
అయితే ఈఎలక్ట్రోరల్‌ ట్రస్టుల ద్వారా సమీకరించ బడుతున్న మొత్తాలు సరిపోకపోవడం ఒకటై ఉండవచ్చు, రెండవది, ”మనము నిధులు సమకూర్చిన తర్వాత ప్రతి ఫలము పొందకపోతే ఎట్లా” అని కార్పొరేట్‌ కంపెనీలు ఆలో చించి ఉండవచ్చు, మూడవది, ”మనకు ఎవరు నిధులు ఇస్తున్నారు, వారి అవసరాలు ఏమిటి, వారికెలా సహాయపడ గలము…” అనే ఆలోచన ప్రభుత్వాలదై ఉండవచ్చు, ఇకచివరిగా, అధికారంలోలేని ప్రతిపక్షపార్టీలకు నిధులు ఎందుకు అని అధికారపక్షం భావించి ఉండవచ్చు. ఈ కార ణాల వల్లనే ఎన్నికల బాండ్ల విధానానికి 2018లో నాంది పడింది. ఈవిధానం నోటిఫై కాకముందే, 2017లోనే అప్పటివరకు కార్పొరేట్‌ సంస్థలు చెల్లించే విరాళాలపై ఆయా కంపెనీల నికర లాభా లపై ఉన్న 7.5శాతం సీలింగ్‌ను కూడా కేంద్రం రద్దుచేసింది. 2018 నుంచి ఎన్ని కల బాండ్ల రూపంలో యదేచ్చగా నిధులను రాబట్టుకోవడం విరాళాలు ఇవ్వని సంస్థ లపై నిర్దాక్షిణ్యంగా దాడులు జరపడం, లొంగదీసుకోవడం పరిపాటిగా మారి పోయింది.
తెలంగాణలోని యశోద హాస్పిటల్‌ 2019- 20లో బీజేపీకి రూ.ఐదులక్షలు విరాళమిస్తే, 2020 డిసెంబర్‌లో జరిగిన ఐటీ దాడుల అనంతరం 2021- 22లో పది కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. హెటిరో కంపెనీ, లలితజ్యువెలర్స్‌, అర బిందో రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, సింటెక్స్‌, హల్దిరామ్స్‌ వంటివారందరూ దాడుల అనంతరం పెద్ద మొ త్తంలో చెల్లించుకున్నట్లు వివరాలు బయటపడ్డాయి. కొన్ని కంపెనీలు సెలెక్టివ్‌గా అనగా తమ ఇండిస్టీ నెలకొల్ప బడిన రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీకి, కేంద్రంలో అధి కారంలో ఉన్నపార్టీకి మాత్రమే విరాళాలు చెల్లించుకున్నారు. ఈకోవలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ ఉన్నది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం నిధులు సమకూరుస్తున్న ఈకంపెనీలకు వాటిని స్వీకరిస్తున్న రాజకీయ పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉ న్నది. ఇంతటి అవినీతి భాగోతాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు కు శ్రీ కృష్ణుడు, సుధాముడు అంటూ పురాణాలలోని వాస్తవ అర్థాన్ని వక్రీకరించే ఆపాదిస్తాడు మన ‘విశ్వగురు’. కంపెనీలు రాజకీయపార్టీలకు సమర్పించే నిధులపై సీలింగు లేకుండా ఆయా నిధుల వివరాలు ప్రజలకు తెలియకుండా ఉండాలన్న నిబంధనలోనే దురుద్దేశం దాగిఉంది. అందుకే ఈఎన్నికల బాండ్లవిధానం పూర్తిగా అవినీతి ప్రక్రియ, దీనిరద్దు అత్యంత ఆవశ్యకం. ఆ దిశలో ముందడుగు వేసిన సుప్రీంకోర్టు నిర్ణయం అభినందనీయం.
జి.తిరుపతయ్య
9951300016