
– వృద్దులు,వికలాంగులకు ప్రయోజనం….
– మొదటి రోజు హోమ్ ఓటింగ్ లో పోలైన 110 ఓట్లు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎన్నికల కమీషన్ మొట్టమొదటి సారిగ దివ్యాంగులు,80 ఏళ్ళు వయస్సు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే ఓటింగ్ అనే సరికొత్త సంస్కరణ చేపట్టింది.ఈ ప్రక్రియలో పోలింగ్ సిబ్బందే నేరు గ వారి వారి ఇళ్ళకు వెళ్ళి సిబ్బందే ఓటును వేయించే పద్ధతిని ప్రవేశపెట్టింది.దీంతో ఆశ్వారావుపేట నియోజక వర్గం వ్యాప్తంగా ముందస్తు దరఖాస్తు చేసుకున్న 174 మందికి ప్రయోజనం చేకూరింది. దరఖాస్తు చేసుకున్న ఓటర్ల దగ్గరకు మంగళవారం, బుధవారం రెండు రోజులలో పోలింగ్ సిబ్బంది ఓటర్ల ఇంటి వద్దకు వెళ్ళి వారి ఓటును తీసుకుంటున్నారు. మంగళవారం మొదటి రోజున 110 మంది ఇళ్ళకు వెళ్ళి ప్రత్యేకంగ ఏర్పాటు చేసిన పోలింగ్ బాక్స్ లో, రహస్య పద్ధతిని ఓటును వేయించారు. ఈ ఓట్లు ను స్వీకరించేందుకు ముందస్తు శిక్ష ణ పొందిన పోలింగ్ సిబ్బంది ప్రత్యేక బాక్స్ లను వాహనాలలో తీసుకెళ్ళి 80 సంవత్సరాలు పైబడిన వృద్దులు 126 మందికి 82 మంది ఓటర్లు,48 మంది వికలాంగులు కు గాను 28 మంది ఓటర్లు చే ఓటరు ఇంటివద్దనే ఓట్లు ను వేయించి నట్లు రిటర్నింగ్ అధికారి,అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు తెలిపారు.