
నవతెలంగాణ-బెజ్జంకి
రెండవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఈ విషయం అందరికి తెలిసిందే.ప్రభుత్వ సెలవు రోజున మండల తహసీల్ కార్యలయంలో విద్యుత్ దోపిడికి గురవుతుంది. తహసీల్ కార్యలయ ప్రధాన ద్వారానికి తాళం వేసినట్టే వేసి..కార్యాలయంలోని విద్యుత్ ను దోపిడి చేస్తూ ద్విచక్ర వాహన చార్జీంగ్ కు వినియోగించుకుంటున్న చిత్రం తహసీల్ కార్యలయం వద్ద కనిపించింది.ప్రభుత్వ సెలవు రోజున కార్యలయంలోని విద్యుత్ దోపిడి గురవుతుండడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు.