విద్యుత్ మోటర్ మాయం

నవతెలంగాణ-ఖానాపురం

గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ మోటర్ దొంగిలించిన ఘటన మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నెలకొన్నది. వివరాల ప్రకారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నీళ్ల సంపు ద్వారా వాటర్ ట్యాంక్ లకు నీళ్లు సరఫరా చేయుటకు విద్యుత్ మోటార్ ను నీళ్ల సంపులో బిగించారు. దసరా పండుగ రావడంతో గత మూడు రోజులు సెలవు దినాలు అవడం కారణంగా కార్యాలయం నిర్మానుష్యంగా ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులు నీళ్ల సంపులోని విద్యుత్ మోటర్ ను దొంగలించారు. విషయాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ఉన్నత అధికారులకు సమాచారం అందించారు.