విద్యుత్ మోటార్లు మంజూరు చేయాలి

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఎస్సి కార్పొరేషన్ ద్వారా తమకు బోర్లు మంజూరు అయ్యాయని, కానీ మోటార్లు మంజూరు కాలేదని వెంటనే విద్యుత్ మోటార్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని ఇచ్చోడ మండలం తలమద్రి దళిత రైతులు కోరారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణికి వచ్చి అధికారులకు తమ సమస్యను విన్నవించారు. గత మూడు సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ద్వారా తమకు బోర్లు మంజూరు అయ్యాయన్నారు. అలాగే విద్యుత్ శాఖ నుండి తమకు కరెంట్ కూడా మంజూరు అయిందని తెలిపారు. కానీ మోటార్లు మంజూరు చేయలేదన్నారు. దింతో పంట పండించుకోవడానికి ఇబ్బంది ఉందని రైతులు వాపోయారు. వెంటనే కార్పొరేషన్ ద్వారా తమకు విద్యుత్ మోటార్లు మంజూరు చేయాలని తద్వారా రబీ పంట వేసుకుంటామన్నారు.