ప్రధాన రహదారిపైనే విద్యుత్‌ స్తంభాలు..

ప్రధాన రహదారిపైనే విద్యుత్‌ స్తంభాలు..– నేలకొరుగుతున్న మహావృక్షాలు
– పట్టించుకోని అధికారులు..
నవతెలంగాణ-పాలకుర్తి రూరల్‌
రోడ్డుకు దూరంలో పాతవలసిన కరెంటు పోల్స్‌ రోడ్డుపైన పాతాడంవల్ల తీగలకు చెట్లు అడ్డొస్తున్నాయని ఏళ్లనాటి నీడనిచ్చే మహా వృక్షాలను నేలకూల్చుతున్న పరిస్థితి.రోడ్డుకు దూరంగా పాతినట్లయితే రైతుల పొలాల్లో నుండి లైన్‌ వేయుటకు ఒప్పుకోవడం లేదని కరంటూ లైన్‌ వేసే కాంట్రాక్టర్‌ అంటున్నారు. పాలకుర్తి నుండి జనగామకు గల ప్రధాన రహదారిలో గల తొర్రూరు గ్రామములో సబ్‌ స్టెయిన్‌ 33/11కిలో వాట్ల సబ్‌ స్టెయిన్‌ చేపడుతున్నారు. దాదాపు రూ.60 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టబోతున్న సబ్‌ స్టేషన్‌ 2023 అక్టోబర్‌ 8 న అప్పటి పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శంకుస్థాపన చేశారు. సబ్‌ స్టేషనకు కావలసిన కరంటూ లైను ఇరవేన్ను సబ్‌ స్టేషన్‌ జంక్షన్‌ నుండి మేయిన్‌లైన్‌ లాగు తున్నారు. తొర్రూరు గ్రామము నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రధాన రహదారి పై నుండి కరంటుపోల్స్‌ పాతుతున్నారు. అట్టి కరెంటు లైన్‌కు చెట్లు అడ్డు వస్తున్నాయని రోడ్డుపై గల ఏళ్ళ నాటి మహావృక్షాలను నేలమట్టం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం హరితహారం పేరుతో రోడ్డు వెంట చెట్లు నాటి వృక్ష సంపద పెంచుటకు కృషి చేస్తున్నాయి. అటువంటి సందర్భంలో రోడ్డుపై గల మహావృక్షాలను కరెంటు లైన్‌ కు అడ్డు వస్తున్నాయనిని కొట్టివేయడం ఎంతవరకు సమంజసమని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు చెట్లు పెంచే స్థలం వదిలిపెట్టి కరెంటు పోల్స్‌ పాతినట్లయితే రహదారి వెంట వన సంపద పెంచుటకే కాక వాతావరణ సమతుల్యతకు, నీడ సౌకర్యం కల్పించే విధంగా అధికారులు శ్రద్ధ తీసు కోవాల్సినన అవసరం ఎంతైనా ఉందని వన ప్రేమికులు, ప్రజలు కోరుతున్నారు.
డీఆర్‌డీవోకు లేఖ ఇచ్చాం
ఆర్‌బి.అండ్‌ డిఈవీ. జీవన్‌ కుమార్‌
రోడ్డుపై అతి సమీపంలో మొక్కలు నాటవద్దని గతంలో డీఆర్‌డీవోకు లేఖ ఇచ్చాం. అదేవిధంగా రోడ్డుపై కూడా కరెంటు పోల్స్‌ పాత వద్దని కూడా సామాచారం ఇచ్చాం.. వాటి గురించి స్పందన రాలేదు. రోడ్డుపై వివిధ రకాల ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌ వాళ్లు, మెషిన్‌ మిషన్‌ భగీరథ వంటి పైపులైన్లు వంటి రకరకాల పనులకు రోడ్డునే త్రవ్వే వేస్తున్నారు.విద్యుత్‌శాఖ వారు కూడా రోడ్డు వెంటనే రోడ్డు ఎన్ని వంకలు తిరిగితే అన్ని వంకలుగా తిప్పుతూ లైన్లు వేస్తున్నారు. వీటి వల్ల ప్రజా రవాణాకు సౌకర్యవంతంగా ఉండవలసిన రోడ్లు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. సంబంధిత శాఖలు రోడ్డుపైనే కాకుండా రోడ్డుకు దూరంలో సంబంధిత ఆపరేషన్‌ పనులు చేసుకున్నట్లయితే బాగుంటుంది.
రోడ్డుపక్కనే పోల్స్‌ వేయడం వన సంపదకు నష్టం
కడుదూరి ప్రభాకర్‌, రైతు
రోడ్డు పక్కనే కరెంటు పోల్స్‌ వేయడం వల్ల వన సంపదకు నష్టమే కాకుండా, రోడ్డు విస్తరణ జరిగినప్పుడు అదనంగా ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉంది. కరెంటు జంక్షన్‌ నుండి వచ్చే మేన్‌ లైను నేరుగా సబ్‌స్టేషన్‌ వరకు స్టేట్‌ గా తీసుక పోయి నట్లయితే ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది.
చెట్లను తొలగించడం మానవ మనుగడకే ప్రమాదం
సోమసత్యం, సీపీఎం. మండల నాయకులు
చెట్లు కొట్టడం వల్ల మానవ మనుగడకే ప్రమా దం ఏర్పడుతుంది. ప్రకృతిలో వాతావరణ సమ తుల్యతను కాపాడుకొనుటకు వన సంపద చాలా కీలకమైంది. గ్రామంలో చెట్లు కొట్టాలంటే ప్రభుత్వ పరిమిషన్‌ కావాలి. కాని ప్రధాన రహదారిపై కరెంటు పోల్స్‌ పాతి చెట్లు అడ్డొస్తున్నాయని ఏళ్ల నాటి వృక్షాలను కూల్చడం ఎంతవరకు సమంజసం. ప్రకృతి వన సంపదను హాని చేయటం సిగ్గు చేటు . తొర్రూరు గ్రామంలో ఏర్పాటు చేయుచున్న సబ్‌ స్టేషన్‌ మెయిన్‌ లైను రూటు మార్చి రోడ్డుకు దూరంలో లైన్‌ వేయాలి.
మాది ఆపరేషన్‌ డిపార్టమెంట్‌ సెక్షన్‌ .
ఆర్‌.బాలగంగాధర్‌ తిలక్‌ , పాలకుర్తి ఇన్‌ఛార్జ్‌ ఎడిఎ
క్రొత్తగా లైన్‌ వేయడం, సబ్‌ స్టేషన్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు కన్స్ట్రక్షన్‌ డిపార్ట్మెంట్‌ సెక్షన్‌ వేరే ఉంటుంది. ముఖ్యంగా రైతుల భూముల నుండి కరెంటు లైన్‌ వేయుటకు రైతులు అడ్డుపడుతున్నారు. సమాచారం కొరకు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అఖిలేష్‌ బాబురావును ‘నవతెలంగాణ’ విలేఖరి ఫోన్‌ ద్వారా సంప్రదించగా పూర్తి సమాచారం చెప్పకుండానే దాటవేసినారు. పూర్తి సమాచారం కావాలని మళ్ళీ ఫోన్‌ చేయగా ఫోన్‌ రిసీవ్‌ కాలేదు.