– ప్రమాదంలో రైతన్నలు.. పట్టించుకోని విద్యుత్ అధికారులు
నవతెలంగాణ – మిరుదొడ్డి
విద్యుత్ వైర్లు రోడ్డు పక్కనే చేతుకు అందేటట్లుగా వేలాడుతున్నాయి. ప్రతిరోజు రోడ్డుపైన తిరుగుతున్న ప్రయాణికులకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రజలు తీర ఇబ్బంది పాలవుతున్నారు. మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలోని పెద్ద లింగన్న గారి ముత్యాలు వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ విద్యుత్ వైరు చేతికి అందెటట్టుగానే కనబడుతున్నాయి .ఇటి విషయాన్ని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోవడం లేదు వ్యవసాయం పొలం వద్ద వరినాధులు వేసేటప్పుడు విద్యుత్ శాఖ గురైన కూడా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడం ఇంత వరకు సమంజసం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన విద్యుత్ వైన్రు నడిచే వ్యక్తులకు చేతికి ఉన్నా కూడా పట్టించుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు. ఉన్నత అధికారులు స్పందించి విద్యుత్ వైర సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.