నవతెలంగాణ- రేవల్లి: రేవల్లి మండల మరియు ఆయా గ్రామాలలో గణేష్ విగ్రహాలు పెట్టె మండప నిర్వాహకులకు తెలియజేయునది ప్రతి గణేష్ మండప నిర్వహణ నిమిత్తం విద్యుత్తు వినియోగానికి గాను, గణేష్ మండపాల నిర్వాహకులు వినియోగించే విద్యుత్తు వాడకమును బట్టి, 1500 నుంచి 5500 రూపాయల వరకు విద్యుత్ వాడటానికి విద్యుత్ వినియోగ రుసుము చెల్లించవలసిందిగా, రేవల్లి మండలంలోని ప్రతి గ్రామంలోని విద్యుత్తు గణేష్ మండప నిర్వాహ కులను పత్రిక ముఖంగా రేవల్లి విద్యుత్ అధికారి శ్రీశైలం గారు తెలియజేయడమైనది. ఇలా సహకరించని యెడల, రేవల్లి మండలంలోని గ్రామాలలో గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది అని రేవల్లి మండల అధికారి శ్రీశైలం గారు తెలియజేశారు.