కనీస వసతులకు నోచుకోని విద్యుత్ సబ్ స్టేషన్..!

Electricity sub station without minimum facilities..!– కంపచెట్ల, పచ్చి గడ్డితో నిండి పోయిన ఆవరణ
– దడ పుట్టిస్తున్న దోమలు
– రాత్రి వేళ సంచరిస్తున్న పాములు
– భయం భయంగా డ్యూటీలు చేస్తున్న ఆపరేటర్లు
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూరమండలం లో  పులిచర్ల, వెల్మగూడెం, పొట్టి చెలిమ, పర్వేదుల, కొత్తలూరు, గ్రామాల్లోకి విధ్యుత్ సబ్ స్టేషన్లు వున్నాయి. అందులో అతి పెద్ద 05 ఎకరాల విస్తీర్ణం లో పెద్దవూర మండల కేంద్రం లో తెలుగుదేశం పార్టీ అధికారం లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుందూరు జానారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ సబ్ స్టేషన్ 29-04-1984 లో 33/11కేవి సబ్ స్టేషన్ 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు.ఆతరువాత 1996 లో ఆపరేటర్లు వుండేదుకు మరియు కంట్రోల్ రూము, సెక్షన్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇప్పుటికీ 28 ఏళ్ళు దాటింది. మళ్ళీ కొత్త కంట్రోల్ రూమ్, సెక్షన్ ఆఫీస్ ఏర్పాటు చేయక పోవడం తో అవి శిధిలావస్తకు చేరాయి. వర్షంవస్తే రూముల్లోనీళ్లు చేరుతాయి.
పనిచేస్తున్న సిబ్బంది
పెద్దవూర సబ్ స్టేషన్లో మొత్తం 20 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఒక ఏఈ, సబ్ ఇంజనీరు, ఇద్దరు లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్లు 07 గురు, జూనియర్ లైన్ మెన్లు 07,ఆపరేటర్లు 03 పని చేస్తున్నారు. అయితే ఈ సబ్ స్టేషన్ల లో అపరేటర్లకు కనీస సౌకర్యాలు లేవు. మండల కేంద్రం లోని  విద్యుత్తు సబ్ స్టేషన్ లోఅరకొర వసతులతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.ఉన్నత స్థాయి విద్యుత్ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారే తప్ప సబ్ స్టేషన్ కు మౌలికవసతులైన మంచినీరు, మరుగుదొడ్లు,విద్యుత్ సిబ్బందికి విశ్రాంతి గదులు  లేవు.కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా లేకపోవడం శోచనీయం.సబ్ స్టేషన్ ఆవరణలో వందలాది పెద్ద పెద్ద కంప చెట్లు, పిచ్చి మొక్కలు, పెరిగి దోమలతో దడ పుట్టిస్తున్నాయి. రాత్రి వేళలో పాములు కూడా సంచారిస్తున్నాయని ఆపరేట్లర్లు మొర పెట్టుకుంటున్నారు. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. రాత్రి వేల ఆపరేటర్ల కు ఏదైనా జిరిగితే దిక్కెవరు. ఈ విషయం  పైస్థాయి విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది.
సబ్ స్టేషన్ లో సరైనవసతులు లేకపోవడం వల్ల విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,రాత్రి సమయంలో విష సర్పాలు, తేళ్లు, వస్తున్నాయని ఆపరేటర్లు ఉపేందర్,గౌసు, యాదయ్య లు పేర్కొన్నారు. రాత్రి వేల కంప చెట్లనుంచి పాములు, తేళ్లు తిరుగుతున్నాయని చాలా సార్లు కనిపించాయని దాంతో భయబ్రాంతులకు గురవుతున్నా మని అక్కడి సిబ్బంది చెపుతున్నారు.మండలంలో విద్యుత్ సిబ్బంది ఫుల్ గాఉన్న వసతులు మాత్రం నిల్ అని అవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నత స్థాయి విద్యుత్ అధికారులు పట్టించుకుని తగిన వసతులు కల్పించాలని విద్యుత్ సిబ్బంది, ఆపరేటర్లు కోరుతున్నారు.