జనసంచారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్.. ఇప్పటికే మూడు ఆవులు మృతి 

Electricity transformer in crowd.. Three cows have already diedనవతెలంగాణ – నసురుల్లాబాద్ 
తీగలు నేలకు తాకుతూ చెట్ల కొమ్మల గుండా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని మండల ప్రజలు వా పోతున్నారు.  నసురుల్లాబాద్  మండలంలోని నెమ్లి గ్రామంలోని సాయిబాబా మందిరం కల్యాణ మండపం వద్ద  ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ భూమికి దగ్గరగా ఉండడం, తీగలు కిందికి వేలాడుతుందంతో వారం రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన మూడు ఆవులు మృతి చెందాయి. ట్రాన్స్‌ఫార్మర్ పక్కనుంచి కల్యాణ మండపానికి దారి ఉండడంతో వారానికి రెండు మూడు శుభ కార్యక్రమాలు జరుగుతాయి. వందల సంఖ్యలో జనాలు ఈ కార్యక్రమాలకు వస్తున్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష ధోరణి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అప్పుడు అ ప్పుడు మెరుపులు వస్తున్నాయి. దీంతో ప్రజలకు పశువుల ప్రా ణాలకు ముప్పు పొంచి ఉంది. ఆయా గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందేలా ఉన్నాయి, ప్ర మాదం సంభవించిన తర్వాత దిద్దుబాటు చర్యలకు లేదా ఎక్స్ గ్రేషియా ప్రకటించడం కన్నా నివారణ చర్యలు చేపట్టడం మం చిది అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు వసూలుపై ఉన్న శ్రద్ద సమస్యలు పరిష్కరించడంలో లేదని గ్రామ ప్రజలు మండి పడుతున్నారు. వెంటనే విద్యుత్ సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.