విద్యుత్ వైర్లు తెగిపడి గొర్రెలు మృతి

నవతెలంగాణ -భిక్కనూర్
ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగిపడి ఆరు గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరసయ్య తన గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. అక్కడ గొర్రెలు మేతమేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ మెన్ వైర్లు తెగిపడి గొర్రెలపై పడడంతో గొర్రెలకు షాక్ తగిలి ఆరు గొర్రెలు మరణించాయి.సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ నరసిములు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించి విద్యుత్ అధికారులతో పాటు పశువైద్యాధికారులకు సమాచారం అందించారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు.