
భువనగిరి పట్టణంలో ఎలక్ట్రిషన్ డే ని ప్రవేట్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భువనగిరి పట్టణంలో ప్రవేట్ ఎలక్ట్రిషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య సలహాదారుడు ఇట్టబోయిన శివశంకర్ మాట్లాడుతూ.. జనవరి 27 1880 రోజు థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్న రోజును పురస్కరించుకొని ఎలక్ట్రిషన్ డేరు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో ముఖ్య సలహాదారులు ఇట్టబోయిన శివశంకర్ గౌరవ అధ్యక్షులు తాడూరి మల్లేష్ అధ్యక్షులు కారు పోతుల కొండల్ ప్రధాన కార్యదర్శి నారి కడపనర్సింగరావు కోశాధికారులు దాకూరి దేవేందర్ ఉపాధ్యక్షులు దేశ నాయక్ ఎంగి పాండు, సహాయ కార్యదర్శులు చింతల కిషోర్, ఎండి ఆజామ్, కార్యవర్గ సభ్యులుగా బైరు సుధాకర్, బూఖ్య సుధాకర్, నాయకులు ఎండి వసీమ్, వహీద్ షామ్, కొండల్ మహేష్, చందు పాల్గొన్నారు.