నవతెలంగాణ భీంగల్
పట్టణ కేంద్రంలోని లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సి.ఇ.సి. చదివిన విద్యార్థి అడెల్లి నిఖిల్ విట్ (వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెన్నై) నందు బి.కామ్. ఆనర్స్ విభాగం లో అర్హత సాధించి కళాశాలను జిల్లాస్థాయిలో మొట్టమొదటి స్థానంలో నిలిపాడు. నిఖిల్ ఇంటర్ సిఇసి గ్రూప్ లో 1000 మార్కులకు గాను 909 మార్కులు సాధించి సి.ఇ.సి. గ్రూప్ లో ప్రథమ స్థానంలో నిలిచి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కీర్తిప్రతిష్ఠలను అందించటమే కాకుండా, విట్ చెన్నై నందు అర్హతను సాధించి కళాశాల విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిల్వటం చాలా సంతోషకరమని ప్రిన్సిపల్ డాక్టర్స్ చిరంజీవి అన్నారు. ప్రభుత్వ కళాశాలలు కూడా ప్రయివేటు కళాశాలకు దీటుగా విద్యను అందించడంలో ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని కళాశాల తెలియజేశారు ఈ సందర్భంగా నిఖిల్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వురుమల్ల కృష్ణదాస్ , మండలోజు. నర్సింహస్వామి, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ నక్క.జాన్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.