అర్హత కలిగిన అంగన్వాడి హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి

Eligible Anganwadi helpers should be promoted as teachers– దండంపల్లి సత్తయ్య
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అర్హత కలిగిన అంగన్వాడి హెల్పర్లకు టీచరుగా పదోన్నతి కల్పించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి కోరారు. మంగళవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో  మహిళా శిశు సంక్షేమ శాఖ సక్కుబాయి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అర్హత ఉండి అంగన్వాడీ హెల్పర్ గా పనిచేస్తూ అనుభవం కలిగిన వారికి పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. 60 సంవత్సరాల వయసు కారణంగా రిటైర్మెంట్ అవుతున్నవారు, సూపర్వైజర్ గా పదోన్నతి పొందిన వారి స్థానాలలో హెల్పర్లకు పదోన్నతులు కల్పించిన తరువాత ఖాళీ పోస్టులు చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ నలగొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి. సరిత, యూనియన్ నాయకులు పి.అనిత  ఏ.ఇందిరా టి  లక్ష్మి, బి.నళిని, జి. పద్మ, తదితరులు పాల్గొన్నారు.