నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇళ్లు,నూతన రేషన్ కార్డుల జారీ,రైతు భరోసాకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్ తెలిపారు.బుధవారం మండల పరిధిలోని తలారివాని పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్ పాల్గొన్నారు.ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు ఎంపికైన అర్హుల జాభితాను గ్రామ సభలో అధికారులు వెల్లడించారు.జాబితాలో పేర్లురాని అర్హులు అందోళన చెదరకుండా దరఖాస్తులు చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ప్రత్యేకాధికారి నాగారాణి,ఏఈఓ భరత్,గ్రామస్తులు పాల్గొన్నారు.
రసాభాసగా గ్రామ సభలు…
మండల పరిధిలోని గూడెం,చీలాపూర్,వడ్లూర్, తలారివాని పల్లి,గాగీల్లపూర్,నర్సింహుల పల్లి,బెజ్జంకి క్రాసింగ్,రాంసాగర్ గ్రామాల్లో అధికారులు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు.ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాల జాబితాలో తమ పేర్లు రాలేవని గూడెం,చీలాపూర్ గ్రామ సభలు రసాభాసగా సాగాయి.అయా గ్రామాల గ్రామస్తులు అధికారులతో వాగ్వాదం చేశారు.చీలాపూర్ లో ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యుల వివరాలు వెల్లడించకుండా అర్హుల జాబితాను ప్రకటించడం సరైందికాదని..ఇంటింటి సర్వేలో దరఖాస్తులు చేసుకున్న ప్రజలందరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.