అర్హులైన ఉపాద్యాయులు ఓటు నమోదు చేసుకోవాలి : తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్

నవతెలంగాణ – అశ్వారావుపేట : అర్హులైన ఉపాద్యాయులు అందరూ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఓటరు గా తమ ఓటు నమోదు చేసుకోవాలని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ సూచించారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో ఆయన అద్యక్షతన వరంగల్ – నల్గొండ – ఖమ్మం ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పై ప్రధానోపాధ్యాయులు తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అర్హులైన ఉపాద్యాయులు అందరూ ఫారం – 19 తో (ఆన్లైన్ / ఆఫ్ లైన్) తమ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఓటు నమోదుకు ఉపాధ్యాయులు గత 6 సంవత్సరాలలో 3 సంవత్సరాలు పాటు ఏదైనా హై స్కూల్,తత్సమాన పైబడిన సంస్థ (ప్రభుత్వ, ప్రైవేట్) పాఠశాలలో విధులు నిర్వహించి యుండాలి అని, ఓటు నమోదుకు 06 నవంబర్ 2014 చివరి తేదీ కావున అర్హులైన ఉపాధ్యాయులు అందరు ఫారం – 19 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారి పొన్నగంటి ప్రసాదరావు,ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.