
– 20 రోజులుగా తాగునీటి ఇబ్బందులు
నవతెలంగాణ-భీమారం: చెడిపోయిన బోరుబావి మోటర్ మరమ్మత్తులు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలంపల్లి గ్రామంలోని తాళ్లగూడెం ప్రజలు ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత బోరు బావిపై 20 కుటుంబాలు ఆధారపడిన ఉన్నాయని, సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారుల పట్టింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా సమస్య పరిష్కరించాలని మొరపెట్టుకున్నప్పటికీ మరమ్మత్తులో పేరుతో బోరు మోటర్ తీసి 10 రోజులు గడుస్తోందని, అయినప్పటికీ తిరిగి మోటర్ బిగిచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే బోరు బావి మరమ్మత్తులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు మాడెం రాజన్న, అనపర్తి శ్రీహరి, చన్న శ్రీరాములు, కోట చిన్న లింగయ్య, మాడెం శ్రీనివాసులు కోరుతున్నారు.