లింగ వివక్షను రూపుమాపాలి : ఎల్కంటి పద్మ 

– గుండారం సమ్మక్క సారలమ్మ జాతరలో చట్టాలపై అవగాహన 
నవతెలంగాణ – బెజ్జంకి 
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాజంలో లింగ వివక్షను రూపుమాపాలని లింగ సమానత్వ ప్రత్యేక ప్రతినిధి ఎల్కంటి పద్మ మహిళలకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని గుండారం గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలపై జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ,మహిళ సాధికారత కేంద్రం అధ్వర్యంలో కరపత్రాల ద్వార అవగాహన కల్పించారు.ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ సులోచన,జిల్లా మహిళ సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ వాసవి తదితరులు పాల్గొన్నారు.