వెదజల్లే పద్ధతిలో వరి సాగు, రైతుకు లాభదాయకం: ఎల్లారెడ్డి ఏడిఏ రత్న

 నవతెలంగాణ – రామారెడ్డి
పెద్ద జల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే రైతులకు ఆర్థికంగా లాభదాయకమని ఎల్లారెడ్డి ఏడిఏ రత్న మంగళవారం అన్నారు. మండలంలోని రామారెడ్డి లో వెదజల్లే పద్ధతిలో వరి సాగును ఏవో హరీష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండల కేంద్రంలో దాదాపు 65 ఎకరాల్లో రైతులు వెదజల్ల పద్ధతిలో వరి సాగు చేశారని, ఎకరాన రూ. 7 నుంచి 8 వేల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని, 2 నుంచి 3 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి పెరుగుతుందని, కూలీల కొరత ఉండదని సూచించారు. వరిలో మొగి పురుగు నివారణకు కాట్రప్ హైడ్రోక్లోరైడ్, క్లోరంట్రా నిలీ ప్రోల్ మందును పిచికారి చేయాలని రైతులకు సూచించారు. వేద్దజల్లే పద్ధతిలో వరి సాగులో మెలకువలను, రైతులు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక ఏ ఈ ఓ రాకేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.