ముగిసిన ఎల్లగిరి క్రికెట్ టోర్నమెంట్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం ఎల్లగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ గత నెల రోజులు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిశాయి. సోమవారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ఫైనల్ మ్యాచ్ కి మొదటి నగదు బహుమతి దాతగా ఖురేషి ట్రేడర్స్ ఓనర్ మహమ్మద్ ఖలీల్ కొత్త శ్రీశైలం యాదవ్ kరూ. 66,789/ మొదటి బహుమతిగా అందజేశారు. ద్వితీయ బహుమతిగా శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ ఓనర్ గోపాల శ్రీశైలం యాదవ్ 30000/ నగదును అందజేశారు. అదేవిధంగా ఎల్లగిరి మాజీ ఉప సర్పంచ్ కందగట్ల పద్మరెడ్డి షీల్డ్ లను అందజేశారు. ఈ టోర్నమెంట్ ఫైరూ.నల్ మ్యాచ్ విజేతలుగా అంజన్న వారియర్స్ మొదటి బహుమతిని గెలుపొందడం జరిగింది. ద్వితీయ బహుమతిగా గణపతి బోర్ వెల్స్ గెలిచారు. ఈ కార్యక్రమంలో ఎల్లగిరి  గ్రామ మజీ సర్పంచ్ రిక్కల ఇందిరసత్తిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి మాజీ కో ఆప్షన్ సభ్యులు రిక్కల జంగారెడ్డి,కొత్త పర్వతాలు యాదవ్ నాయకులు వెంకట్ రాంరెడ్డి,బాలకృష్ణ రెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం,రిక్కల మహేందర్ రెడ్డి,కందగట్ల జంగారెడ్డి,మారగొని కోటి తదితరులు పాల్గొన్నారు.