నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
చరిత్ర, మహిమ కలిగిన ఎల్లమ్మ తల్లి హుస్నాబాద్ ప్రాంత రైతులను ప్రజలను చల్లంగా, క్షేమంగా చూడాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కోరారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్లమ్మ తల్లి బోనాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాబోయే కాలంలో అందరూ బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చేసుకునే ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ గొప్పదన్నారు.