నవతెలంగాణ గాంధారి
గాంధారి మండలంలోని పర్మల్ తాండా కు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు సర్దార్ నాయక్ ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్దార్ నాయక్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాపై మీ నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి యువతకి, ప్రతి ఓటర్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మీ ఆశీస్సులతోనే ఈ విజయం సాధించాను. కుటుంబం లాంటి మీ అందరి మద్దతు నాకు బలాన్ని ఇచ్చింది. ఈ గెలుపు మీ అందరికీ ఆత్మీయంగా అంకితం మీ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడం అద్వేయం కాంగ్రెస్ పార్టీలో పని చస్తానని అందర్నీ కలుపుకొని పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సర్దార్ నాయక్ అన్నారు.