తెలంగాణ రాష్ట్ర నూతన టిపిసిసి అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ ని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో సామాజిక న్యాయానికి ఒక నిలువుటద్దం లాంటిదన్నారు. అందుకు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బహుజన బిడ్డైన మహేష్ కుమార్ గౌడ్ నియమించడం చాలా సంతోషకరమన్నారు.
నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపతానికి కృషి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంట పోతా రెడ్డి పేట కాంగ్రెస్ నాయకులు బోయిని పరశురాములు, మహిపాల్ యాదవ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.