అభివృద్ధికి పట్టం కట్టండి

– అన్నిరంగాల్లో మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి
– మహేశ్వరంలో జరిగిన గొల్లకురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
నవతెలంగాణ-మహేశ్వరం
మహేశ్వరం నియోజక వర్గం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి చేసిన వారికే మళ్లీ పట్టం కట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం పోతర్ల బాబయ్య ఫంక్షన్‌లో జరిగిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీచై ర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యా రు. మహేశ్వరం చౌరస్తా వద్ద బారీ క్రేన్‌ సహాయంతో గొల్లకు రుమలు మంత్రికి బారీ పూల మాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలం గాణకు సీఎం కేసీఆర్‌ ఒక వెన్నముక లాగా పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ను కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. గొల్ల కురుమలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని అన్నారు. కుల వృత్తులకు సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ట్టు తెలిపారు. హైదరాబాద్‌ నడిబొ డ్డున వంద కోట్లు పలికే చోట కురుమ భవనానికి రూ.5 కోట్లు కేటాయించా రు. గొర్రెలను మెపుకోవడానికి స్థలాన్ని కేటాయించే అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. బీజేపీ గ్యాస్‌ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే వంట గ్యాస్ను రూ. 4 వందలకే అందజేయనున్నామని ఆమె తెలిపారు. రైతు బంధు సాయాన్ని త్వరలోనే రూ. 18 వేలు ఎకరానికి అందించనున్నట్టు ఆమె అన్నారు. 93 లక్షల మంది రేషన్‌ కార్డు దారులకు రూ. 5 లక్షల బీమాతో ధీమాను కల్పి స్తామన్నారు. రాబోయే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి తనను మళ్లీ గెలిపిం చాలని కోరారు. జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌ రెడ్డి మాట్లా డుతూ.. మహేశ్వరం నియోజక వర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న పను లు చరిత్రలో నిలుస్తాయని అన్నారు. గొల్ల కురుమ లు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నా రు. అంతకుముందు జరిగిన ఓ కార్యక్రమంలో ఇతర పార్టీల నాయకు లు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలోబీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు కౌశిరెడ్డి, ఇన్‌చార్జి ఎంపీపీ సుని తా ఆంధ్యానాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మంచె పాండు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షు డు అంగోతు రాజునాయక్‌, నియోజక వర్గం బీసీ సెల్‌ అధ్యక్షుడు మల్లేశ్‌యా దవ్‌, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, నియో జక వర్గం కార్యదర్శి గుండెమోని అంజ య్య ముదిరాజ్‌, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్‌, వెంకటేశాయా దవ్‌, బురమోని నర్సింహయాదవ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ ధిల్‌అలీ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పొల్కం బాలయ్య, ఎంపీటీసీ కుమారి రాయప్ప, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వర్కల యాదగిరి గౌడ్‌, ఉపసర్పంచ్‌ పోతుల నర్సింగ్‌ పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.