నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా సమావేశం స్థానిక వివేరా హోటల్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 45 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశములో టిజిఇజేఎసి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా నూతన కమిటీ..
చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ ధరణికోట భగత్, అడిషనల్ సెక్రటరీ జనరల్ కుంట్ల అమరేందర్ రెడ్డి, కో- చైర్మన్స్ ము క్కెర్ల యాదయ్య, చీకూరి జగన్, బాణాల రామ్ రెడ్డి, రెవిన్యూ శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ రాజ్, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్, ఎండి ఖదీర్, జి శశికాంత్, పంచాయతీ సెక్రటరీ పి. శ్రీకాంత్, అజీజ్ అలీ ఖాన్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ , వైస్ చైర్మన్స్, కల్లూరి రమేష్, నాయిని లక్ష్మీనరసింహారెడ్డి, కేతావత్ రవీందర్ నాయక్, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, పెన్షనర్స్ పి రవికుమార్, రెవిన్యూ, వై శ్రీనివాస్ రెడ్డి, పి శ్రీనివాస్, వెటర్నరీ, సెక్రటరీలు, జి అంబికా ఇరిగేషన్, ఎండి జానీ, సెర్ప్, కటరమణ, వెటర్నరీ సురేష్, సిలివేరు మహేష్, మోడల్ స్కూల్ ,కే రమేష్ బాబు టాప్రా , ఫైనాన్స్ సెక్రటరీ, కే కుమార్, మున్సిపల్, ఆఫీస్ సెక్రటరీలు,సిహెచ్ లక్ష్మి,కేజీబీవీ, గడ్డం బాలస్వామీ, అనిల్, ప్రచార సెక్రటరీ, శైలజ, మహిళా ప్రతినిధి, డి.కవిత ఇరిగేషన్లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకోబడిన టీజీఇజెఎసి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ 2022 నుండి రావాల్సిన ఐదు కరువు(డి.ఎ )భత్యములను వెంటనే విడుదల చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని ఆర్థిక బిల్లులను క్లియర్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా 51 శాతం ఫిట్మెంట్తో తెలంగాణ రాష్ట్ర రెండవ పిఆర్సి ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు ఆరోగ్య పథకమును అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని,317 జీవోను సమీక్షించి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.