టీఎన్జీవో భీమ్గల్ యూనిట్ అత్యవసర కార్యవర్గ సమావేశం 

నవతెలంగాణ – కంఠేశ్వర్

టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, హుస్సేని ఆదేశాల మేరకు టీఎన్జీవో భీమ్గల్ యూనిట్ ఆధ్వర్యంలో, యూనిట్ అధ్యక్షులు రాజశేఖర్ యూనిట్ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటుచేసిన టీఎన్జీవో భీమ్గల్ యూనిట్ అత్యవసర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్ కార్యవర్గ సమావేశంలో బుధవారం పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఇతరత్రా విషయాలపై తీర్మానాలు చేసి,  ఇటీవలే సాదరణ బదిలీల్లో ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లినందున ఖాళీలు ఏర్పడ్డ అధ్యక్ష కార్యదర్శులు ఇతరత్రా పదవులకు గాను, భీమ్గల్ యూనిట్ నూతన అధ్యక్షులుగా బొంపల్లి సృజన్ కుమార్ (ఎంప్లాయ్మెంట్& ట్రైనింగ్ (ఐటిఐ) శాఖ)ని, యూనిట్ కార్యదర్శిగా ఎనుగందుల గంగాజమున (పంచాయతీరాజ్ శాఖ) సహాధ్యక్షులుగా కుంట శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా నరేష్, రవి తదితరులు కో ఆప్షన్ పద్ధతిన ఎన్నుకున్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. నూతనంగా కోఆప్షన్ పద్ధతిన ఎన్నుకోబడిన అధ్యక్ష యూనిట్ అధ్యక్ష కార్యదర్శులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సభ్యులందరూ ఏకవాక్య తీర్మానంతో యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులను కో ఆప్షన్ పద్ధతిన ఎన్నికకు సహకరించినందుకు ప్రతి సభ్యుడికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులందరూ సమన్వయంతో సంఘటితంగా ఉద్యోగుల సమస్యలపై పోరాడి హక్కుల సాధన కొరకు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి , కేంద్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, భీమ్గల్ యూనిట్ కార్యవర్గ సభ్యులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.