ఉపాధి కార్మికుడిని పట్టించుకొని ఉపాధి సిబ్బంది

– ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి, మెరుగైన వైద్యం అందించాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ – పెబ్బేరు
శ్రీరంగాపురం మండలం నాగసాని పల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద జక్కని కుంట లో శనివారం పనులు చేస్తున్న వ్యవసాయ కూలీలలో గోవిందమ్మ అనే మహిళకు నాలుగు ఫీట్ల ఎత్తు నుంచి మట్టి పెల్లలు విరిగి ఆమె కుడి కాలుపై పడ్డాయి.దీంతో మోకాలి కింద కాలు విరిగింది. పక్కలో ఉన్న కూలీలు కాలు విరిగిన గోవిందమ్మను తమ ఇంటికి చేర్చడం జరిగింది. ఈ విష యాన్ని తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. ఆంజనేయులు, పెబ్బేరు మండల కార్యదర్శి ఆర్‌. దేవన్న నాగసానిపల్లి గ్రామము బాధి తురాలు కుటుంబాన్ని కి వెళ్లి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బృందానికి గోవిందమ్మ తనకు జరిగిన ప్రమాదాన్ని గురించి చెప్పడం జరిగింది. అదే రోజు సాయంత్రం తమ భర్త వచ్చిన తర్వాత కిరాయి వాహనముతో హాస్పిటల్స్‌ కు తీసుకువెళ్లి చూపించగా కుడికాలు మోకాలు కింది భాగం విరిగిందని రిపోర్టు ద్వారా డాక్టర్లు చెప్పారని చెప్పింది. తన ఆర్థిక పరిస్థితి బాగా లేక చికిత్స చేయించుకోలేక తిరిగి తన స్వగ్రామానికి రావడం జరిగింది అని చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద పనిచేసిన కూలీకి కాలు విరిగిన కూడా ఈజీఎస్‌ సిబ్బంది ఏమాత్రం కనికరం లేకుండా పట్టించుకోకుండా పని దగ్గరనే వదిలి రావడం జరిగింది. ప్రమాదం వల్ల కాలు విరిగిన గోవిందమ్మను ఈజీఎస్‌ సిబ్బందే అంబులెన్స్‌ ను తీసుకొచ్చి, ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేయాల్సిన బాధ్యతను విస్మరించి, తమ బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరించడం ఈజీఎస్‌ చట్టం ప్రకారంగా విరుద్ధమని, కాలు విరిగిన గోవిందమను గాలికి వదిలేసాడం సరైన పద్ధతి కాదు. ఈజీఎస్‌ ఉన్నతాధికారులు గాని, మండల ఎంపీడీవో గాని ఏపీవో గాని ఆ కుటుంబాన్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు. చట్టం ప్రకారంగా కూలీ పని చేస్తున్న గోవిందమ్మ ప్రమాదానికి గురైతే, ఇంత నిర్లక్ష్యం వహించడం ఈజీఎస్‌ ఉన్నతాధికారులకు తగని పని.ఆర్థిక స్థోమత లేని ఆ కుటుంబానికి తక్షణమే 50వేల రూపాయలు ఆర్థిక సహకారం చేసి, గోవిందమ్మను మెరుగైన వైద్య చికిత్సకు పంపాలని, గోవిందమ్మ కోలుకునే వరకు రోజువారీగా హాజరవేసి ఆమె బకాయి కూలి డబ్బులు తక్షణ విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేశారు. ఉపాధి చట్టం కింద పనిచేసిన కూలి గోవిందమ్మను పట్టించుకోకుంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు బాధితురాలు, వారి కుటుంబ సభ్యులతో సహా ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. పరమర్శించిన బందం సభ్యులు ఆర్‌ దేవన్న, పరశురాం, హరీష్‌ తదితరులు ఉన్నారు.