– తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రంజిత్ కుమార్
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతి పత్రం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న టీ-శాక్స్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, విలీనం చేసుకోవాలని టీ-శాక్స్ ఉద్యోగులు ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. టీ-శాక్స్ ఉద్యోగులు 20 ఏండ్లుగా తెలంగాణలో ఉన్న అన్నీ ప్రభుత్వ ఆస్పత్రిల్లో హెచ్‌ఐవీ పేషంట్లకి ఐసీటీసీ, ఏఆర్టీ, డీఎస్‌ఆర్‌సీ, పీపీటీసీ పరీక్షలు నిర్వహిస్తూ సర్వీస్ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేసినట్టే టీ-శాక్స్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రిని కోరారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రిన్సిపాల్ హెల్త్ సెక్రటరీలు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అధికారులకు నివేదికలు పంపించిందని, ఈ నివేదికను ఆధారం చేసుకుని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు శాక్స్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విలీనం చేసుకున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్యామిలీ వెల్ఫే డిపార్ట్‌మెంట్‌లో విలీనం చేసుకొని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో.. ప్రముఖ రాజకీయ వేత్త రెంటాల కేశవరెడ్డి, వరంగల్ జిల్లా డీపీఎం స్వప్న మాధురి, వరంగల్ జిల్లా డిఎస్ రామకృష్ణ, ఎల్‌టీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.న