
ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకి వారదులుగా పాత్ర పోషిస్తారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఉద్యోగ సంఘాల పాత్ర కీలకం అని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ లో సర్వసభ్య సమావేశం నిజాంబాద్ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న డిఎ పిఆర్సి పరిష్కరించాలని చర్చించడం జరిగింది ప్రభుత్వం ప్రజలకి చేరువ కావాలంటే ఉద్యోగులుగా వారదులుగా ఉంటారు అని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఇటీవల టాటా గ్రూప్ ఆధ్వర్యంలో దేశ సేవలో భాగమయ్యి ప్రజలకు సేవ చేసిన వారికి అవార్డు ప్రధానం చేశారు. ఈ దేశరత్న అవార్డు పొందిన టీజీవో అధ్యక్షులు అలుక కిషన్ ని సభ్యులందరూ గౌరప్రధంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ అమృత్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ జలగం తిరుపతిరావు, దేవి సింగ్, నాగమోహన్, సంఘ సభ్యులు హనుమంత్ రెడ్డి, ప్రవీణ్,లావణ్య, సాయిలు, సాయి కృష్ణ, గోపికృష్ణ, నాగరాజు, పావని, చందర్, స్వామి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.