
నవతెలంగాణ – కంఠేశ్వర్
టీఎన్జీవోఎస్ కు విచ్చేసి ఉద్యోగ మిత్రులు శాలువా బఫెలో కాకుండా ఉద్యోగుల సమస్యల చుట్టాలతోనే విచ్చేయాలని జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొదటగా మలిదశ ఉద్యమకారుడు స్వర్గీయ శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకొని, టీఎన్జీవో జిల్లా కార్యవర్గం 2 నిమిషాలు మౌనం పాటించి, అమరవీరులను, ఉద్యమకారులను స్మరించుకొని, అనంతరం ఎజెండా అంశాలపై, వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై సుధీర్గంగా చర్చించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ… పదవి బాధ్యతలు చేపట్టి నేటికీ నెల రోజులు గడుస్తున్నను.. ఇప్పటివరకు సమస్యల పరిష్కారానికి మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ప్రాథమిక సభ్యుడికి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉద్యోగ మిత్రులు టిఎన్జీవో కార్యాలయానికి బొకేలు, శాలువాలతో రావద్దని, మీకున్న ఉద్యోగ సమస్యలతో వచ్చినట్టయితే, వాటిని మాత్రమే ఆత్మీయంగా స్వీకరించి, జిల్లా పరిధిలో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరిస్తూనే, క్లిష్టమైన సమస్యలను గౌరవ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ కి ప్రధాన కార్యదర్శి హుస్సేని తెలియపరచి, వారితో సమన్వయపరచుకొని వాటిని పరిష్కరించుటకు మా వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
చివరగా ప్రతి ప్రాథమిక సభ్యులు టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, విధిగా టీఎన్జీవోఎస్ సభ్యత్వాన్ని పొంది, హక్కుల సాధన కొరకుపోరాడుటకు కలిసి రావాలని కోరారు. అనంతరం సుదీర్ఘ కాలం పాటు టీఎన్జీవో నందు వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, బదిలీల కారణంగా ఇతర జిల్లాకు వెళ్లిన కారణంగా వారిని టీఎన్జీవోస్ పక్షాన శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాభినందనలు టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శుల బృందం తెలియజేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , కేంద్ర ఉపాధ్యక్షులు గైని గంగారం , కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ , జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి , పెద్దోళ్ల నాగరాజు , కోశాధికారి సుంకరి దినేష్ బాబు, సలహాదారులు ఆకుల ప్రసాద్, వనమాల సుధాకర్, యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.