ఉద్యోగులు సక్రమంగా సేవలు అందించాలి:  వీసీ గోవర్ధన్

Employees should render services properly:  VC Govardhanనవతెలంగాణ – ముధోల్
ఆర్జీయూకేటీ బాసర ఉద్యోగులు సక్రమంగా సేవలు అందించాలని అన్నారు. పరిపాలన భవనములో గల కాన్ఫరెన్స్ హాల్ నందు  వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యక్షత న సమన్వయ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ అధికారులు, 13 విభాగాల అధిపతులతో  సుదీర్ఘ సమాలోచనలు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి స్వాగత ఉపన్యాసం  చేశారు. అనంతరం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడారు. ప్రతి విభాగపు అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అకడమిక్ సెక్షన్, ఎగ్జామినేషన్ సెక్షన్, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,  ప్రొక్యూర్మెంట్,  నెట్వర్కింగ్ అండ్ సాఫ్ట్వేర్ సెక్షన్ ల అధికారులు తమ నివేదికలను అందించారు. నివేదికల ఆధారంగా విశ్వవిద్యాలయ పరిధిలో చేపట్టవలసిన పనులు,  తీసుకోవలసిన చర్యలను త్వరితగతిన పూర్తిచేయాలని వీసీ ఆదేశించారు. స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పై విస్తృతంగా చర్చించారు. అలాగే విశ్వవిద్యాలయ అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. సాంకేతిక పోటీ ప్రపంచంలో సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు విద్యార్థులను సిద్ధం చేయాలని  అధ్యాపకులను సూచించారు. ప్రతి అధ్యాపకుడు ఒక అంబాసిడర్ గా తమ విధులను నిర్వహించి విశ్వవిద్యాలయ ఖ్యాతిని పెంపొందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. సెల్ఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే నినాదాన్ని విద్యార్థులలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని సూచించారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ సర్వేను  నిర్వహించేందుకు తగిన సాప్ట్వేర్ ను  రూపొందించాలని కౌన్సిలింగ్ సెల్ ను ఆదేశించారు.  క్యాంపస్ హెల్త్ సెంటర్  సమగ్ర నివేదిక  ఆధారంగా తీసుకోవాల్సిన  చర్యల గురించి ప్రస్తావించారు.  అనంతరం నాన్ టీచింగ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.  విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి నాన్ టీచింగ్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో అసోసియేట్ డిన్స్,  వివిధ విభాగాల అధిపతులు,  పి ఆర్ ఓ,  టీచింగ్ ,నాన్ టీచింగ్ ఉద్యోగులు, తదితరులు, పాల్గొన్నారు.