యజమానులు పేర్లును ప్రదర్శించాలి

– యూపీ పోలీసుల ఉత్తర్వులుపై తీవ్ర విమర్శలు
– ఫాసిస్టులను అనుసరిస్తున్న బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ .. సీపీఐ(ఎం)
లక్నో: కన్వర్‌ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులపై అనేక విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కన్వర్‌ యాత్ర జరిగే మార్గంలో అన్ని హోటళ్ల యాజమానులు తమ పేర్లను ప్రముఖంగా కనబడే విధంగా ప్రచురించాలని ముజఫర్‌నగర్‌ పోలీసులు ఉత్తర్వులు చేయడం వివాదస్పదంగా మారింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకునే పోలీ సులు ఉత్తర్వులు జారీ చేసారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఉత్తర్వులపై సీపీఐ(ఎం) తీవ్రంగా స్పందించింది. ఫాసిస్టులతో పోరాడలని చరిత్ర నేర్పిందని అయితే ఫాసిస్టులను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్నాయని ఒక ప్రకటనలో సీపీఐ(ఎం) విమర్శించింది. మతపరమైన విభజనను సృష్టిం చేందుకు యోగి అదిత్యనాథ్‌ ప్రభుత్వ పోలీసులు చేసిన సిగ్గు మాలినచర్యగా ఈ ఉత్తర్వులను విమర్శించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోనూ ముస్లిం దుకాణ యజమానులను లక్ష్యంగా చేసుకునే యత్నం జరుగుతోందని సీపీఐ(ఎం) విమర్శించింది.