కూలీలకు ఉపాధి హామీ చట్టం పనులు ఉపయోగకరం

– డీఆర్డీవో శ్రీలత
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ఎండాకాలంలో కూలీలకు ఉపాధి హామీ చట్టం పనులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయనీ డీఆర్డీవో శ్రీలత అన్నారు. సామాజిక ప్రజావేదిక కార్యక్రమం సోమవారం రాత్రి వరకు ప్రజా వేదిక తనిఖీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2020-23 సంవత్సరానికి సంబంధించి 14వ సామాజిక వేధిక నిర్వహించినట్టు తెలిపారు. 417 పనుల గాను రూ. రెండు కోట్ల 12 లక్షలు ఖర్చు చేసినట్టు వివరించారు. రెండవ తేదీ నుంచి ఆయా గ్రామాల్లో 9వ తేదీ వరకు జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు వివరించారు. పేద ప్రజలందరికీ వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలందరూ జాబ్‌ కార్డు చేయించుకుని పనులు చేయాలని కోరారు. ఈ విషయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రత్యేక శ్రద్ధతో తమ తమ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుభాషిని, డీవీవో.కొండయ్య, ఎంపీడీవో వెంకయ్య, విజిలెన్స్‌ అధికారి, ఏపీవో, ఎస్‌ఆర్‌డీ, డీఆర్పీ, పిఎస్‌ తదితరులు ఉన్నారు.