షిప్ బ్రిడింగ్ పనులు పరిశీలించిన ఉపాధిహామీ ఏపీఓ

నవతెలంగాణ- మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో ఉపాది కూలీలు చేస్తున్న  ఫిష్ బ్రీడింగ్ పనులను మంగళవారం ఉపాధిహామీ ఏపిఓ గిరి హరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలోని ఊర చెరువులోని ఫిష్ బ్రీడింగ్ పనులను సందర్శించి, కూలీలతో మాట్లాడారు కోలతల ప్రకారం పని చేస్తే ఒక్క రోజుకు రూ.300 కూలి వస్తుందన్నారు.మండలంలో అన్ని గ్రామాల్లో పని ప్రదేశాల్లో కూలీలకు మంచి నీళ్లు, నీడ పందిరి,మెడికల్ కిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పని ప్రదేశంలో కూలీలకు మంచి నీళ్లు, నీడ పందిరి, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని ఉపాది సిబ్బందినిఉపాది ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్  శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ అజ్మీర సంతోష్ , కూలీలు పాల్గొన్నారు.