
నెలల తరబడి పనిచేస్తున్న ఉపాధి కూలీలకు అధికారులు బిల్లులను చెల్లించడం లేదని కేవైసీ పేరుతో బ్యాంకు అధికారులు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని యువసజన రాష్ట్ర సమైక్య (యువైఏప్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడారు అధికారులు చూపించిన కొలతల ప్రకారం పనిచేసిన కూలీలకు రోజువారి వేతనం గిట్టుబాటు కావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు వారం వారం వేతనాలు ఇవ్వాలని రోజువారి పే స్లిప్పులు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని పనిముట్లు పార, గడ్డపార, తట్టలు ,ఇవ్వాలని గడ్డపారకు సాన పెట్టడానికి 150 రూపాయలు ఇవ్వాలని సమ్మర్ అలవెన్స్ లు అందించాలని పని ప్రదేశంలో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.