ఉపాధి హామి బిల్లులను విడుదల చేయాలి

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
– జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీను నాయక్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీను నాయక్‌ అన్నారు. ఉపాధి హామీ పెండింగ్‌ లో ఉన్న డబ్బులను వేయాలని ఫరూఖ్‌ నగర్‌ మండల ఏపీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ఉపాది హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని, బడ్జెట్‌లో భారీగా నిధులు తగ్గించిందని అన్నారు. ఉపాది హమీ చట్టంలో అనేక మార్పులు తెచ్చి, పేదలకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పనిచేసిన ఉపాధి కులిలకు సకాలంలో బిల్లులను ఇవ్వకపోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధులు రాకపోవడంతో ఉపాధి కూలీలు ఇతర పనులకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే ఐదు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న ఉపాధి నిధులను విడుదల చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఉపాధి కూలీలు పని ప్రదేశంలో మెడకల్‌ కిట్లు ఉంచాలని, ఉపాధి కూలీలకు గహలక్ష్మి వర్తింపజేయాలని, ఉపాధి కూలీ ప్రదేశంలో చనిపోతే ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలని, ఉపాధి కూలీలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ కూలీలను పని దినాలను 200ల రోజులకు పెంచాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు చంద్రకాంత్‌, నాయకులు శివకుమార్‌, మాధవి, యాదమ్మ, రమేష్‌, సరిత, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.