
నవతెలంగాణ – బెజ్జంకి
కరువు పరిస్థితులను ఎదుర్కొవడానికి కుటుంబానికి 100 రోజుల పని కల్పించి ఉపాధి అందించాలనే గొప్ప సంకల్పంతో అమలవుతున్న ఉపాధి పథకం కాంగ్రెస్ ప్రభుత్వ చలువనేనని మానకొండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి చెన్నారెడ్డి ఉపాధి కూలీలకు తెలిపారు.బుధవారం మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో చేపట్టిన ఉపాధి హమీ కూలీలకు కాంగ్రెస్ శ్రేణులు మజ్జిగ పంపిణీ చేశారు.కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని మేనిఫెస్టో కరపత్రాలతో నాయకులు ఓట్లు అభ్యర్థించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి,మాజీ సర్పంచ్ చిలుముల దేవదాస్,అర్షణపల్లి భూమయ్య, గ్రామ యువ నాయకులు చుక్క సమీకృత్,చిలుముల మల్లేష్,మిట్టపల్లి రాజిరెడ్డి,బాల్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మామిడి తిరుపతి రెడ్డి,సంపత్ రెడ్డి,అర్షనపల్లి అంజయ్య,వంశి,రాహుల్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మండల వ్యాప్తంగా జోరుగా ప్రచారం..
మండల పరిధిలోని అయా గ్రామాల్లో కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.మండల వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.