వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

నవతెలంగాణ – దంతాలపల్లి
వడదెబ్బకు గురై ఉపాధి హామీ కూలి మృతి చెందింది. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన గంగినేని లింగమ్మ (60 ) ఉపాధి హామీ కూలి పనికి వెళ్లి వడదెబ్బకు గురైంది. పని ప్రదేశం నుంచి వస్తున్న క్రమంలో అస్వస్థలకు గురి కావడంతో కుటుంబీకులు, తొర్రూర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.