ఉచిత చేప పిల్లలతో మత్స్యకారులకు ఉపాధి

Employment of fishermen with free fish fryనవతెలంగాణ – పెద్దవూర
మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడానికే ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుందని నాగార్జున సాగర్ ఏంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి చరిత అన్నారు. బుధవారం పెద్దవూర మండలలోని శిరసనగండ్ల గ్రామంలోని ఊర చెరువులో ఉచిత చేపపిల్లల విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో నిండిన అన్ని చెరువులు, కుంటల్లో ఉచిత చేప పిల్లలను పోయనున్నట్లు తెలిపారు. ఊర చెరువులో 1.20 లక్షల రవ్వ, పాంప్లెంట్స్, వంటి చేపపిల్లలు చెరువులో విడుదల చేశామని తెలిపారు. మత్స్యకారులు చేప పిల్లలను పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, పెద్దగూడెం మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, మార్కెట్ హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షురాలు చామల సువర్ణ, జిల్లా నాయకులు యడవెల్లి దేవేందర్ రెడ్డి, రాజ శేఖర్ శర్మ, సొసైటీ ఛైర్మెన్ మర్రి బాలయ్య, చిట్టిమల్ల సైదులు, లంగంపల్లి శ్రీనివాస్, దోరేపల్లి శ్రీనివాస్, కొండలు, కమ్మంపాటి శ్రీనివాస్, సైదులు తదితరులు పాల్గొన్నారు.