గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు

నవతెలంగాణ -మహాముత్తారం
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటురునాగారం ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు  జాకారం మరియు కాటారం యూత్ ట్రైనింగ్ సెంటర్ లలో వేర్ హౌస్ అసోసియేట కోర్సులో రెండు నెలలపాటు ఉచిత శిక్షణ, వసతి కల్పించి వివిధ ప్రైవేట్ కంపెనీల నందు ఉపాధి అవకాశాలు కల్పించబడును. శిక్షణాకాలంలో శిక్షణకు అవసరమగు మెటీరియల్, నోట్ బుక్స్ పెన్ మరియు యూనిఫామ్ షూస్ అందించబడును. ఈ యొక్క శిక్షణ తీసుకొనుటకు కావాల్సిన అర్హతలు.1. గిరిజన నిరుద్యోగ యువతీ యువకులై ఉండవలెను.2. కనీస చదువు 10వ తరగతి పాస్ అయి ఉండవలెను 3.18 నుంచి 30సం. ల వయస్సు కలిగి ఉండవలెను. శిక్షణ అనంతరం బహుళజాతి కంపెనీలకు సంబంధించిన సంస్థల లో ఉద్యోగ అవకాశాలు కల్పించ బడును. నెలకు రూ. 12000 నుండి రూ. 20000 వరకు జీతం ఉంటుంది. కావున పైన తెలుపబడిన శిక్షణ యందు ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు తేదీ 08.01.2024 నాడు జాకారం మరియు కాటారం యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు ప్రారంభమగు శిక్షణకు ఉదయం 11 గంటలకు హాజరు కాగలరని ప్రాజెక్టు ఆఫీసర్ ఐటిడిఏ ఎటునాగారం గారు తెలియజేసినారు.పూర్తి వివరాలకు సంప్రదించు ఫోన్ నెంబర్ 9949614348.