శిక్షణతో ఉపాధి అవకాశాలు..

– వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ జగన్నాథ చారి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
శిక్షణ తో ఎన్నో ఉపాది అవకాశాలు ఉంటాయని ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ జగన్నాథ చారి, నాబార్డ్ డిడిఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ శివారులోని ట్రైజం సెంటర్ లోని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ లో శనివారం బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్ శిక్షణ ను ప్రజ్వలన చేసి ప్రారంభించారు .ఈ సందర్భంగా జగన్నథ చారి మాట్లాడుతు స్వయం ఉపాధి వలన కుటుంబానికి అండగా ఉంటారని, ప్రతి వ్యక్తి తము చేస్తున్న వృత్తులతో పాటు కోళ్ళ పెంపకం, గోర్రెల పెంపకం, పశువుల పెంపకం వాటితో అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ వృత్తులకు నాబార్డ్ ఎల్లప్పుడూ సహయకారిగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, రాజితా, నవీన్, నర్మాద్ర, ఫరీదా, బ్యూటి పార్లర్, మగ్గం శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.