
మహిళా వికలాంగులకు ఇంటి వద్ద కుటీర పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేసి వారికి ఉపాధి కల్పించాలని ఎన్టీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.ఎన్ పి ఆర్ డి మహిళా విభాగం జిల్లా కమిటీ సమావేశం కొత్త లలిత అధ్యక్షతన నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా వికలాంగులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ఇప్పటికీ మహిళల ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఆదుకొని పరిస్థితి లేదన్నారు. అందుకోసం మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇంటి దగ్గర ఉపాధి కల్పించాలని మహిళా వికలాంగుల హక్కుల రక్షణ కోసం ఎన్ పి ఆర్ డి పోరాడుతుందని అన్నారు వికలాంగులపై వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని మహిళా వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు అందించాలని పెళ్లి కానీ మహిళా వికలాంగులకు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిరంతరం పోరాడుతుంది అని డిమాండ్ చేశారు ప్రతి వికలాంగుల కుటుంబానికి అంతో దయ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మధిర పద్మ, కొండాపూర్ మనోహర,బర్ల పార్వతి, కుంచోతు అనసూయ, జి చంద్రకళ పాల్గొన్నారు.