
కార్ పూలింగ్ వ్యక్తులు రైడ్‌లను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది, రోడ్డుపై వాహనాల సంఖ్యను తగ్గిస్తుంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. అంతేగాకుండా, ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాల్లో పెట్టుబడి పెట్టడం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు వెలువడడాన్ని, శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ, ఎండీ, దేవేంద్ర చావ్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సుస్థిరదాయకమైన రవాణా అనేది ఒక ఎంపిక మాత్రమే కాదని మేం నమ్ముతున్నాం. పచ్చని భవిష్యత్తును సృష్టించడంలో ఇది ముఖ్యమై న భాగం. మా ఎలక్ట్రిక్ బస్ సర్వీస్‌తో, మేం ప్రయాణికులకు సురక్షితమైన, సుస్థిరమైన, సౌకర్యవంతమైన ప్ర యాణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, సంప్రదాయ అంతర్-నగర రవాణాకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని అందిస్తాం’’ అని అన్నారు. న్యూగో సుస్థిరత్వ సూత్రాలకు కట్టుబడి ఉంది. తన ఎలక్ట్రిక్ బస్సు సేవలను మరిన్ని నగరాలు, ప్రాంతాలకు విస్తరించే మార్గాలను నిరంతరం అన్వేషిస్తోంది. న్యూగో వంటి హరిత రవాణా ఎంపికలను స్వీకరించడం ద్వారా, వ్యక్తులు వాతావరణ మార్పులను తగ్గించడానికి, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొం దించడానికి చురుకుగా దోహదపడతారు.