స్కిన్‌ కేర్స్‌ ఉత్పత్తి చేస్తూ…గిరిజన మహిళలకు సాధికారత కల్పిస్తూ…

Producing Skin Cares...Empowering Tribal Women...రిన్జింగ్‌ చోడెన్‌ భూటియా… సిక్కింకి చెందిన మహిళా పారిశ్రామికవేత్త… స్కిన్‌కేర్‌ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తూ గిరిజన మహిళలకు సాధికారత కల్పిస్తోంది. ఆర్గానిక్‌, హ్యాండ్‌క్రాఫ్ట్‌ పద్దతిలో స్కిన్‌కేర్‌ ఉత్పత్తులను తయారు చేసే సంస్థకు ఆమె ఫౌండర్‌. దీని ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు సబ్బులు తయారు చేయంలో శిక్షణ ఇస్తూ… సొంత వ్యాపారాలు ప్రారంభించేలా వారిని ప్రోత్సహిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
అమెరికాలో తన మేనత్తతో కలిసి ఆన్‌లైన్‌ ఎల క్ట్రానిక్స్‌ వ్యాపారం ప్రారంభించిన భూటియా 2012లో తన స్వస్థలమైన సిక్కింకు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. అయితే ఢిల్లీ కాలుష్యం కారణంగా కొంత ఇది ఇబ్బందికరంగా మారింది. స్థలం అందుబాటు లో లేకపోవడం, భర్త, పిల్లలను పెంపకం, కుటుంబ బాధ్య తలతో కొన్ని ఏండ్లు గడిచి పోయాయి. తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఏదో ఒకటి చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఏర్పడింది.
ప్లాస్టిక్‌ నియంత్రించాలని
”నా భర్తకు అతని పూర్వీకుల నుండి కొంత ఆస్తి వచ్చింది. ఉత్తర సిక్కింలోని కబీలో అగాపి ఫార్మ్‌ అని పిలువబడే దాని చుట్టూ ఒక వ్యవ సాయ నివాసాన్ని నిర్మించాలని నిర్ణయించు కున్నాం. దాని చుట్టూ చెక్క కాటేజీలను నిర్మిస్తున్నాం” అని ఆమె చెప్పారు. ప్లాస్టిక్‌ను నివారించాలనే ఉద్దేశంతో ఆమె ఈ ఆలోచన చేశారు. భూటియా ఇంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని గోరుబతన్‌లో ఒక జంట నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె చేతితో తయారు చేసిన సబ్బుల తయారీ గురించి నేర్చుకున్నారు. తమ స్థలాన్ని ఉపయోగించు కోడానికి ఇది తన మొదటి అడుగుగా ఆమె భావించింది. అప్పటి నుండి భూటియా వంట గది నుండి బయటకు వచ్చి చేతితో తయారు చేసిన సబ్బులను తయారు చేయడం ప్రారంభించారు.
ఇతరుల మాదిరిగా కాకుండా…
వ్యాపారం ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే కోవిడ్‌-19 కారణంగా అగాపి ఫామ్‌లో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ‘వివిధ సేంద్రీయ పదార్థాలపై పరిశోధన చేయడానికి, సబ్బు తయారీ గురించి మరింత అర్థం చేసుకోవడానికి నాకు తగినంత సమ యం దొరికింది. దాంతో నేను సబ్బుల తయా రీని కొనసాగించాను. అయితే ఇతర సబ్బు తయారీదారుల మాదిరిగా కాకుండా శతాబ్దా లుగా సిక్కింలో అందుబాటులో ఉన్న ఔషధ మొక్కలపై దృష్టి పెట్టాలనుకున్నాను’ అని ఆమె చెప్పారు. ఇదే ఆమె బ్రాండ్‌ అగాపి సిక్కిమ్‌లో ప్రారంభించేలా చేసింది. ఇది పెద్దఎత్తున చర్మ సంరక్షణ ఉత్పత్తులు, పరిష్కారాలను అందిస్తుంది.
ఔషధ మొక్కల ద్వారా…
మెటీరియల్‌ కోసం ఇతరులపై ఆధార పడటానికి బదులుగా భూటియా తన చుట్టూ అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించు కోవాలని భావించింది. స్థా నిక ఔషధ మొక్క లను వాడుకోవాలని నిర్ణయించుకుంది. టైట్‌ పాటి లేదా మగ్‌వోర్ట్‌ అని పిలవబడే మొక్క ఇన్వాసివ్‌ రకం కలుపు. ఇందులో ఒత్తిడిని తగ్గించడం, జీర్ణక్రియలో సహాయం చేయడంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్‌గా ప్రసిద్ధి చెందడం వంటి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బాగా పెరిగిన పసుపు, కలబంద వంటి మొక్కలు కూడా ఇందులో ఉపయోగిస్తారు.
సామాజిక కోణంలో…
కరోనా తగ్గిన తర్వాత భూటియాకు సిక్కిం లోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌ డిపార్ట్‌ మెంట్‌తో కలిసి గ్రామంలోని 21 మంది మహిళలకు చేతితో తయారు చేసిన సబ్బులు, చర్మ సంరక్షణ ఉత్ప త్తులను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చే అవకాశం లభిం చింది. ఇప్పుడు అగాపి సిక్కిం కేవలం వ్యవస్థా పక ప్రాజెక్ట్‌ మాత్రమే కాదు, సామాజిక కోణం లో కూడా ఉంది. ఇది నేటికీ కొనసాగుతోంది. ‘నేను మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించి నప్పుడు పాఠశాలకు వెళ్లలేని, జీవనోపాధికి అవకాశం లేని గిరిజనులను నేను గుర్తించాను. ఆ మహిళలంతా తమ భర్తలపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు. కేవలం ఇంటి పనులను మాత్రమే పరిమితమయ్యారు’ అని ఆమె పంచుకున్నారు.
ఓ మంచి మార్గంగా…
వారు తమ ఇళ్లను విడిచిపెట్టడానికి, ఇతర మహి ళలతో కలిసి ఉండటానికి, వారి సమస్య లు, కోరికలను పంచుకోవడానికి, రోజులో కొంత సమయం తమ కోసం కేటాయించుకోడానికి ఈ సంస్థ ఓ మంచి మార్గంగా మారింది. మూడు నెలల శిక్షణా తర్వాత 10 మంది మహిళలు హ్యాండ్‌క్రాఫ్ట్‌ సబ్బులను తయారు చేయడానికి స్వయం సహాయక బృందాన్ని (ఎస్‌హెచ్‌ జీ) ఏర్పాటు చేసుకున్నారు. రెండేండ్లలో భూటియా 400 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. తన చుట్టూ ఉన్న గిరిజన సంఘాల్లో సాధికారత సాధించేలక్ష్యంతో కొనసాగుతున్నారు.భూటియా యూకేలో ఉన్నపుడు ఆర్గానిక్‌ కాస్మెటిక్‌ ఫార్ములే షన్‌ స్కూల్లో ఫార్ములా బటానికా నుండి చర్మ సంరక్షణలో ఆన్‌లైన్‌ కోర్సును అభ్యసించారు. ఇదే క్రీమ్‌లు, లోషన్‌ల వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించేం దుకు ఆమెను ప్రోత్సహించింది.
చిన్నగా మొదలై…
ఆమె బృందం తయారు చేసిన అన్ని ఉత్పత్తులు ల్యాబ్‌ ద్వారా ధృవీకరించబడతాయి. ప్రారంభంలో ఆమె చిన్న బ్యాచ్‌లతో ఉత్పత్తు లను తయారు చేయడం ప్రారంభించి వాటిని జెడబ్ల్యు మారియట్‌, తాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ వంటి హోటళ్లకు సరఫరా చేశారు. ఇతర అమ్మ కాలు తమకున్న పరిచయాలు, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా జరిగాయి. ప్రస్తుతం ఉత్పత్తులు వారి సొంత వెబ్‌సైట్‌ అగాపిసికిమ్‌.కామ్‌లో అందుబాటులో ఉన్నాయి.
మహిళలను సిద్ధం చేస్తూ…
‘స్థానికంగా అవోకాడోలు పుష్కలంగా లభి స్తు న్నాయి. అలాగే సీజన్లో నారింజ కూడా దొరుకుతాయి. ఇలాంటి సహజ పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తు లను తయారు చేస్తున్నాం. వ్యాపారంతో పాటు నేను సిక్కింలోని వివిధ మూలల నుండి వచ్చిన మహిళలను కలుస్తూనే ఉంటాను. వారికి ఉత్పత్తులను ఎలా తయా రు చేయాలో నేర్పించడమే కాకుండా మార్కెటింగ్‌, ప్యా కేజింగ్‌, పంపిణీ నైపుణ్యాలలో కూడా వారిని సిద్ధం చేస్తాను. ఇప్పుడు వారు ఎక్కువగా ఫెయిర్లు, ఎగ్జిబిషన్‌ వంటి ప్రభుత్వ ఛానెల్‌ల ద్వారా అమ్ముతారు. అలాగే ఇతర మార్గాల ద్వారా కూడా అమ్మకాలు పెంచాలని భావిస్తున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.